గుండెలు జారే యాక్సిడెంట్.. నలుగురిని చంపేసిన అంబులెన్స్ - MicTv.in - Telugu News
mictv telugu

గుండెలు జారే యాక్సిడెంట్.. నలుగురిని చంపేసిన అంబులెన్స్

July 21, 2022

ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్సులు ప్రాణాలు కూడా తీసేస్తున్నాయి. కొంతమంది డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఇటీవల అంబులెన్స్ ప్రమాదాలు కూడా ఇతర రోడ్డు ప్రమాదాల్లాగే మారిపోయాయి. కర్ణాటకలోని ఉడిపి జిల్లా ఓ అంబులెన్స్ టోల్ ప్లాజాను హాలీవుడ్ గ్రాఫిక్స్ మూవీ తరహాలో భయంకరంగా ఢీకొట్టి నలుగురిని చంపేసింది. అంబులెన్స్ డ్రైవర్ కూడా మృతుల్లో ఉన్నాడు. ఓ రోగిని కుందాపురం నుంచి వేగంగా హొన్నవరలోని ఆస్పత్రికి తీసుకెళ్తున్న అంబులెన్స్ బిద్నూర్ మీదుగా వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. అంబులెన్స్ వస్తోందని, రోడ్డులో పడిపోయిన డివైడ‌ర్‌ను తీసేందుకు వెళ్లిన టోల్ ప్లాజా ఉద్యోగిని ఘోరంగా అదుపు తప్పి ఢీకొట్టింది. తర్వాత టైర్లు బరస్ట్ కావడంతో పల్టీకొట్టి మరికొందర్నీ ఢీకొట్టింది. ప్రమాదంలో.. అంబులెన్సులోని డ్రైవర్, ఇద్దరు సహాయకులు, టోల్ ప్లాజా ఉద్యోగి చనిపోయారు.