Karnataka RTC conductor charged Rs 10 extra for laptop
mictv telugu

ఆర్టీసీలో ల్యాప్‌‌టాప్‌‌పై ఎక్స్‌‌ట్రా చార్జీ.. మండిపడుతున్న టెకీలు

November 11, 2022

 

ఆర్టీసీలో ప్రయాణించేటప్పుడు మన వెంట లగేజీ తీసుకెళ్తే 30 కేజీల బరువు వరకు ఛార్జ్ ఉండదు. అంతకు మించి తీసుకెళ్తే దూరాన్ని బట్టి డబ్బులు తీసుకుంటారు. ఇదేకాక, పెంపుడు జంతువులు, చిన్న పిల్లలతో ప్రయాణిస్తే హాఫ్ టిక్కెట్ తీసుకుంటారు. కానీ, ఓ కండక్టర్ ఓ టెకీ నుంచి కేజీ బరువుండే ల్యాప్ టాప్ కి ఛార్జీ వసూలు చేశాడు. ఒక్క కేజీనే ఉంది కదా అంటే రూల్స్ మారాయి అంటూ దబాయించి మరీ తీసుకున్నాడు. ఈ విషయం సదరు టెకీ బయటపెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఉత్తర పశ్చిమ కర్ణాటక ఆర్టీసీ బస్సులో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సంస్థకు చెందిన ఓ బస్సులో ఓ ప్రయాణికుడు గడగ్ జిల్లా నుంచి హుబ్బళ్లికి వెళ్లేందుకు టిక్కెట్ తీసుకున్నాడు. అయితే అతని దగ్గర ల్యాప్ టాప్ ఉందనే కారణంతో కండక్టర్ అదనంగా రూ. 10 ఇవ్వాలని పట్టుబట్టాడు. ఎందుకంటే ఎక్స్ ట్రా లగేజని బదులిచ్చాడు. 30 కేజీల వరకు ఫ్రీకదా అని చెప్పినా కండక్టర్ వినిపించుకోలేదు. రూల్స్ మారాయని దబాయించి మరీ పది రూపాయలు వసూలు చేశాడు. ఈ విషయం సోషల్ మీడియలో వెలుగు చూడడంతో నెటిజన్లు ఆర్టీసీపై మండిపడుతున్నారు. అక్టోబర్ 29వ తేదీన సంస్థ జారీ చేసిన నిబంధనల ప్రకారం 30 కేజీల వరకు ఫ్రీ అనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. జరిగిన ఘటనపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే ఇలాంటివి అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు.