Karnataka textbook says ‘Savarkar flew out of jail cell on bulbuls’
mictv telugu

‘సావర్కర్ పిట్టపై కూర్చుని వెళ్లేవారు..’ పాఠంపై రచ్చరచ్చ

August 29, 2022

Karnataka textbook says ‘Savarkar flew out of jail cell on bulbuls’

వినాయర్ దామోదర్ సావర్కర్.. వివాదాలకు కేంద్ర బిందువైన పేరు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన కూడా పోరాడాడని ఆరెస్సెస్.. కాదు, పిరికరిపందగా బ్రిటిష్ వారికి లొంగిపోయి పింఛన్ పుచ్చుకున్నాడని కాంగ్రెస్, లెఫ్ట్ తదితర పార్టీల మధ్య ఎప్పుడూ చర్చలు సాగుతుంటాయి. వీటికి తాజాగా మరో వివాదం తోడైంది. ‘‘సావర్కర్ ప్రతిరోజూ బుల్‌బుల్ పిట్టలపై కూర్చుని అండమాన్ జైలు నుంచి స్వదేశానికి వచ్చి మాతృతిభూమి చూసేవారు’’ అని ఓ పాఠ్యపుస్తకంలో రాయడమే దీనికి కారణం.

కర్ణాటక 8వ తరగతి పాఠ్యంలో పుస్తకంలో ఈ కథ ఉంది. కేకే గట్టి అనే రచయిత స్వీయకథనం చెబతున్నట్లు ఇది రాశారు. అండమాన్ జైలు పర్యటనను ప్రస్తావించారు. ‘‘సావర్కర్ గారిని నిర్బంధించిన జైలు గదిలో చిన్న రంధ్రం కూడా లేదు. అయితే ఆ గదికి రోజూ బుల్‌బుల్ పిట్టలు వచ్చేవి. ఆయన వాటిపై ఎక్కి కూర్చుని ప్రతిరోజూ మాతృభూమి చూసివచ్చేవారు.. ’’ అని గట్టి అందులో రాశారు.

చిన్నపిట్టపై మనిషి కూర్చుని ఎలా ప్రయాణిస్తారంటూ విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు హోరెత్తుతున్నాయి. చరిత్రకు బీజేపీ మసిపూస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి. కర్ణాటకలో సావర్కర్ ఇటీవల వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన పాత్రపై ప్రచారం యాత్ర ప్రారంభం కాగా, బ్రిటిష్ వారికి లొంగిపోయిన మనిషిని దేశభక్తిగా చూపుతున్నారని విపక్షాలు విమర్శిస్తున్నారు. సావర్కర్ జీవితం, ఉద్యమంపై ఓ పరిశోధన సంస్థను కూడా ఏర్పాటు చేస్తుండడంపైనా వివాదం సాగుతోంది.

Karnataka textbook says ‘Savarkar flew out of jail cell on bulbuls’