కర్ణాటకలోని కలబురగి జిల్లాలోని వక్ఫ్ ట్రిబ్యునల్ మహాశివరాత్రి రోజున ఆలంద్ లోని లాడ్ల్ ముషక్ దర్గాలో పూజలు చేసేందుకు ముస్లింలకు, హిందువులకు అనుమతినిచ్చింది.
హిందూ.. ముస్లిం ‘భాయ్.. భాయ్’ అని అనుకునే దేశం మనది. అంతెందుకు మన వేములవాడలో కూడా గుడి ముందు ఒక దర్గా ఉంటుంది. ఈ శైవ క్షేత్రానికి హిందువులు ఎలా వస్తారో, ముస్లిం లు కూడా వచ్చి పూజ చేస్తారు. అలా కర్ణాటకలోని ఒక స్థలంలో అటు దర్గా, ఇటు శైవ క్షేత్రం ఉంది. అయితే గతేడాది ఇక్కడ ఘర్షన జరిగినందు వల్ల అక్కడ పూజలు కొనసాగడం లేదు. కానీ ఈ సంవత్సరం పూజ చేసుకోవచ్చని వక్ఫ్ ప్రకటించింది.
14వ శతాబ్దంలో సూఫీ పండితుడు తన తాత్విక ఆలోచనల కారణంగా ఇక్కడ దర్గా నిర్మించారు. 15వ శతాబ్దానికి చెందిన రాఘవ చైతన్య సమాధి కూడా ఉంది. ఇది చాలా సంవత్సరాలుగా ముస్లింలు, హిందువల ఉమ్మడి ప్రార్థనా స్థలంగా ప్రసిద్ధిగాంచింది. గతేడాని మార్చిలో ఘర్షణ జరిగింది. నవంబర్ 2021లో కూడా రాఘవ చైతన్య విగ్రహం అపవిత్రమైందని, దాన్ని శుద్ధి చేయాలని హిందూత్వ సంస్థ పట్టుబట్టడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అందుకే అప్పటి నుంచి పూజలు జరుగడం లేదు. ఈ సంవత్సరం మాత్రం యథావిధిగా అటు నమాజ్, ఇటు శివరాత్రి పూజలు జరుగుతాయని అక్కడి డిప్యూటి కమిషనర్ యశ్వంత్ గురుకర్ తెలిపారు.
సమయాన్ని బట్టి..
శనివారం ఉర్సు పండుగ. దీనికోసం ముస్లింలకు ఉదయం 8 నుంచి 12 గంటల సమయం కేటాయించారు. హిందువులకు శివరాత్రి పూజ కోసం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6గంటల మధ్య దర్శనం చేసుకోవచ్చు. అయితే ఆందోల మఠానికి చెందిన సిద్ధలింగ స్వామితో పాటు, మరో 14మందికి మాత్రమే దర్గా లోపలికి అనుమతినిస్తారు. అంతేకాదు.. ఆలంద్ కు 2కిలోమీటర్ల పరిధిలో 1,050మంది పోలీసు సిబ్బందిని నియమించారు. 12 చెక్ పోస్టులతో వచ్చిపోయేవారిని తనిఖీ చేస్తారు. సాయంత్రం 6 తర్వాత దర్గా వద్ద ఎవ్వరూ ఉండకూడదని పోలీసులు ఆదేశించారు.