కర్ణాటక కేబినెట్ గురువారం కీలక నిర్ణయాలు తీసుకుంది. దౌర్జన్యాలు, దాడులలో దళితులెవరైనా చనిపోతే వారి కుటుంబాలలో అర్హత కలిగిన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని తీర్మానించింది. సీఎం అధ్యక్షతన జరిగిన ఈ భేటీ వివరాలను శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి మాధుస్వామి వెల్లడించారు. రైతులకు డీజిల్ సబ్సిడీని కొత్తగా ప్రకటించారు. ఎకరాకు రూ. 250లు ఇచ్చేందుకు ఆమోదించారు.
గోడౌన్ల నిర్మాణానికి నాబార్డు నుంచి రూ. 800 కోట్ల రుణం, ఎగువ భద్రా నుంచి రూ. 1300 కోట్లతో పైప్లైన్ ద్వారా తాగునీటి సరఫరాకు కేబినెట్ ఆమెదించింది. ఇవి కాక, శాషన సభలో ఆమోదమై పరిషత్లో పెండింగ్లో ఉన్న మతమార్పిడి నిరోధక బిల్లుకు ఆర్డినెన్స్ జారీ చేశారు. బిల్లు ఆమోదానికి గవర్నర్కు పంపాలని నిర్ణయించారు.