కామాంధుడికి చెప్పుదెబ్బలు.. ఫోన్ చేసి పోకిరి తాట తీసింది - MicTv.in - Telugu News
mictv telugu

కామాంధుడికి చెప్పుదెబ్బలు.. ఫోన్ చేసి పోకిరి తాట తీసింది

September 18, 2020

ncgn

ఫోన్ చేసి నిత్యం వేధిస్తున్న ఓ పోకిరీకి మహిళ తగిన బుద్ధి చెప్పింది. చెప్పుతో రెండు చెంపలు వాయించి కుటుంబ సభ్యులతో కలిసి చితకబాదింది. పక్కా స్కెచ్‌తో అతనికి స్పాట్ పెట్టి చివరకు పోలీసులకు అప్పగించారు. కేరళలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఆమె తెగువకు అంతా మెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారికి సరైన రీతిలో బుద్ధి చెప్పారని కామెంట్లు పెడుతున్నారు. 

women….

Publiée par Aluri Raju sur Vendredi 18 septembre 2020

ముదసర్ అహ్మద్ అనే వ్యక్తి పెళ్లైన మహిళ ఫోన్ నంబర్ సంపాధించాడు. దాని ఆధారంగా ప్రతి రోజూ ఫోన్‌ చేసి వేధిస్తున్నాడు. ఎవరికి తెలియకుండా తనను కలవాలని కోరేవాడు. అతడి ఆగడాలు భరించలేక విషయం భర్త, కుటుంబ సభ్యులకు చెప్పింది. వెంటనే ప్లాన్ రెడీ చేశారు. మాట్లాడేందుకు రావాలని పిలిచింది. ఓ చోట ఇద్దరూ కలుసుకున్నారు. కొంత సేపటికి సినిమా స్టైల్‌లో ఆమె భర్త అక్కడికి వచ్చాడు. వెంటనే ఆమె తన చెప్పు తీసి రెండు చెంపలు వాయించింది. అంతా కలిసి నడిరోడ్డుపైనే చితకబాదారు. దీనిపై కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ ప్రారంభించారు.