సన్నీ‌లీయోన్ సినిమాకు ఆటంకం.. ఎందుకో తెలుసా? - MicTv.in - Telugu News
mictv telugu

సన్నీ‌లీయోన్ సినిమాకు ఆటంకం.. ఎందుకో తెలుసా?

October 23, 2018

‘వీర మహాదేవీ’.. ఈ చిత్రం తెలుగుతో పాటు మరో ఆరు భాషల్లో తెరకెక్కుతోంది. శృంగార తార సన్నీ లియోన్‌ ప్రధాన పాత్రలో నటిస్తోంది. అయితే ఈ సినిమా నుంచి సన్నీని తొలగించాలని కర్ణాటక రక్షణ వేదికె యువసేన సోమవారం ధర్నాకు దిగింది. సినిమా షూటింగ్ వెంటనే ఆపేయాలంటూ నినాదాలు చేశారు. షూటింగ్ ఆపకపోతే ప్రాణాలు తీసుకుంటామని హెచ్చరించారు.బెంగూళురు కొందరు యువకులు వీర మహాదేవి సినిమా చిత్రీకరణను వ్యతిరేకిస్తూ చేతులను బ్లేడ్లతో కోసుకున్నారు. వీర మహాదేవిని పాత్రలో సన్నీ లియోన్ నటించడం తప్పని, పోర్న్ స్టార్ ను తీసుకొచ్చి.. వీర మహాదేవిని అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా షూటింగ్‌ను వెంటనే ఆపేసి, వాడి ఉదయన్ అందరికీ క్షమాపణల చెప్పాలని వారు డిమాండ్ చేశారు. సన్నీ పోస్టర్లను దహనం చేసి, అనంతరం సినిమా నిలిపివేయాలని జిల్లా అధికారికి వినతిపత్రం అందజేశారు.