కాల్మొక్కినా కనికరించని ఆఫీసర్... - MicTv.in - Telugu News
mictv telugu

కాల్మొక్కినా కనికరించని ఆఫీసర్…

July 20, 2017

భూములు పోయాయ్..పరిహారం రాకపాయె..కన్నీళ్లు ఆగకకపాయె. దొరా నీ కాల్మొక్త.. అన్యాయం చేయొద్దు.. అని వేడుకున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదు. ఇది భూ నిర్వాసితుల ఆవేదన..దేశంలో ఎక్కడైనా ఇంతే. పరిహారం కోసం పోరు తప్పడం లేదు. పూట గడవక పైసాల కోసం కాల్మొక్కినా ఎవరు చలించడం లేదు.

కర్ణాటకలో కృష్ణా అప్పర్‌ ప్రాజెక్టు కోసం తీసుకున్న తమ భూములకు పరిహారం ఇవ్వాలని నిర్వాసితులు బాగల్‌కోటే జిల్లా కార్యాలయాన్ని ముట్టడించారు. ఇందులో భాగంగా ఓ అధికారి కార్యాలయం బయటికి రాగానే మహిళలు దొరా నీ కాళ్లు మొక్కుతాము మాకు అన్యాయం చేయకండని ఆయన కాళ్లు పట్టుకున్నారు. బాగల్‌కోటే లో కష్ణాఅప్పర్‌ ప్రాజెక్టు పనులు నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఏళ్లు గడిచినా పరిహారం అందలేదు.కాళ్లు మొక్కినా కూడా అధికారులు చలించడం లేదు..