హీరో కార్తి ‘ఖైదీ’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. మీరు చూడండి - MicTv.in - Telugu News
mictv telugu

హీరో కార్తి ‘ఖైదీ’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. మీరు చూడండి

October 14, 2019

తమిళ మీరో కార్తి నటిస్తున్న ఖైదీ సినిమా తెలుగు ట్రైలర్ విడుదలైంది. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ అభిమానుల అంచనాలను మరింత పెంచేస్తోంది. దీపావళికి ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. హీరోయిన్, సాంగ్స్ అనే అంశమే లేకుండా ఈ సినిమాను తీయడంతో సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.  

ఈసినిమాలో కార్తి యావజ్జీవ శిక్ష పడిన ‘ఢిల్లీ’ అనే ఖైదీ పాత్రలో కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఒక రాత్రిలో జరిగిన కథాంశాన్నే ఈ సినిమా స్టోరీగా ఎంచుకున్నారు. జైలు నుంచి తప్పించుకోవడం, స్మగ్లింగ్ ముఠాతో గొడవ పడటం వంటి అంశాలు దీంట్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా ఖాకి సినిమా తర్వాత మంచి హిట్ అందుకోని కార్తి మరి ఈ సినిమాతో అయినా హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.