Karthik took hat-trick wickets in T20 World Cup against srilanka
mictv telugu

టీ20 వరల్డ్‌కప్‌ : లంకపై హ్యాట్రిక్ వికెట్లు తీసిన యూఏఈ బౌలర్ కార్తీక్

October 18, 2022

ఇప్పుడు జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో తొలి హ్యాట్రిక్ నమోదయింది. మంగళవారం జరిగిన గ్రూప్ – ఎ క్వాలిఫయర్ మ్యాచులో శ్రీలంక – యూఏఈ జట్లు తలపడగా, లంక జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఈ సందర్బంగా సంచలనం నమోదైంది.

ఇన్నింగ్స్ 15వ ఓవర్ వేసిన కార్తీక్ మెయ్యప్పన్ చివరి మూడు బంతులకు మూడు వికెట్లు తీశాడు. రాజపక్స, అసలంక, షనక వికెట్లు తీసి తొలి హ్యాట్రిక్ సాధించాడు. ఓవరాల్‌గా చూస్తే ప్రపంచ కప్‌లో 5వ బౌలర్‌గా రికార్డులకెక్కాడు. యూఏఈ తరపున ఆడుతున్న లెగ్ బ్రేక్ బౌలర్ కార్తీక్ పేరు భారతీయతకు దగ్గరగా ఉండడంతో ఆయనెవరనే ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. 2000లో చెన్నైలో పుట్టిన కార్తీక్.. తర్వాత 2012లో కుటుంబం దుబాయ్ వెళ్లిపోవడంతో యూఏఈ తరపున క్రికెట్‌లో 2019లో ఆరంగ్రేటం చేశాడు. ఇప్పటివరకు మొత్తం 8 వన్డేలు, 12 టీ20లు ఆడి 28 వికెట్లు తీశాడు. అటు లక్ష్యచేధనకు దిగిన యూఏఈ జట్టు బ్యాటింగులో విఫలమైంది. 17.1 ఓవర్లలో 73 పరుగులు మాత్రమే ఆలౌటయింది. చమీరా, హసరంగ చెరో మూడు వికెట్లు తీసి ప్రత్యర్ధి జట్టు పతనాన్ని శాసించారు.