karthikeya explained about oscar expenditure
mictv telugu

అంత అవ్వలేదు…ఇదిగో అసలైన లెక్కలు

March 27, 2023

karthikeya explained about oscar expenditure

ఆర్ఆర్ఆర్ సినిమా సృష్టించిన ప్రభంజనం, ఆస్కార్ సాధించడంలో టీమ్ ప్రయాణం లాంటి విషయాల గురించి కొత్తగా చెప్పాల్సి పని లేదు. సినిమా మొదలైన దగ్గర నుంచీ అవార్డు వచ్చేంతవరకు ఎవరెవరు ఎలా కష్టపడ్డారు, ఏం చేవారు లాంటి విషయాలు అన్నీ ఎప్పటికప్పుడు రాజమౌళి అండ్ టీమ్ షేర్ చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఈ సినిమాపై ప్రశంసలు ఏ స్థాయిలో వచ్చాయి విమర్శలు కూడా అలాగే వచ్చాయి. ఆస్కార్ సినిమా ప్రమోషన్ కోసం రాజమౌళి టీం ఏకంగా 80 కోట్లు ఖర్చు చేశారంట అంటూ సోషల్ మీడియా ప్రచారం జరిగింది. తమ్మారెడ్డి భరద్వాజ కూడా మీడియా ఎదురుగానే ఈ విషయాన్ని చెప్పారు. ఇప్పుడు దీని గురించి స్వయంగా ఈ వ్యవహారాలన్నీ చూసుకున్న కార్తికేయనే క్లారిటీ ఇచ్చాడు. ఎంత ఖర్చయిందో లెక్కలతో సహా చెప్పాడు.

ఆస్కార్ అవార్డ్ అందుకున్న తర్వాత రాజమౌళి తప్ప మిగతా వాళ్ళందరూ మీడియా ముందుకు వస్తున్నారు. ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అలా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలోనే కార్తికేయ ఆస్కార్ అవార్డు వెనుక ఎంత ఖర్చింది అన్నది మొత్తం లెక్కలు చెప్పాడు. ఈ సినిమాని హాలీవుడ్ స్టూడియోలలో ప్రదర్శించడానికి మనకి ఛాయిస్ లేదు. అందుకే ప్రమోషన్ చేయాలని డిసైడ్ అయ్యాం. ఈ కారణంగా ఒక ఐదు కోట్లతో సినిమాని ప్రమోట్ చేయడానికి ప్లాన్ చేశాం. మొదటి పార్ట్ కి మూడు కోట్ల రూపాయలు ఖర్చయింది అని చెబుతున్నాడు కార్తికేయ.

ఆస్కార్ అఫీషియల్ ఎంట్రీ దొరికిన తర్వాత మళ్ళా కొంత బడ్జెట్ పెంచి మూవీ ప్రమోషన్ చేయడం మొదలుపెట్టామని తెలిపాడు. ఆ విధంగా ఫైనల్ అయ్యే సరికి మొత్తం 8.5 కోట్లు ఖర్చు అయింది. ఈ సినిమాని న్యూయార్క్ లాస్ ఏంజిల్స్ లలో ప్రత్యేకంగా స్క్రీనింగ్ వేసాము. అలాగే క్యాంపెయిన్ కోసం కూడా ఖర్చు అయింది. వీటన్నింటితో పాటూ ఈ సినిమాని ఇష్టపడినవాళ్ళు సోషల్ మీడియాలో విస్తృతంగా హ్యాష్ ట్యాగ్ లతో మూవీని ట్రెండ్ చేశారు. అది కూడా సినిమా కి కలిసి వచ్చింది.

ఏది ఏమైనా ఈరోజు ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చింది అంటే అది ప్రేక్షకుల అభిమానం వలన మాత్రమే. అలాగే ఆస్కార్ వేడుకలో పాల్గొనడానికి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ రాహుల్ కాలభైరవకు ఇన్విటేషన్ వచ్చింది. ఇక కీరవాణి చంద్రబోస్ నాటు నాటు పాటతో అఫీషియల్ ఎంట్రీ లభించింది. మిగిలిన టీం కోసం ఒక్కొక్కరికి 1500 డాలర్లు పెట్టి టికెట్లు తీసుకున్నాం. అయితే ఇది ఎవరికైనా కామన్ గా ఉండే ఫీజ్. కచ్చితంగా టికెట్ కొనుక్కొని వెళ్లాల్సిందే అంటూ కార్తికేయ ఇంటర్వ్యూలో మొత్తం ఈ సినిమా ప్రమోషన్స్ కోసం పెట్టిన వివరాలు చెప్పేశాడు. దీంతో ఫుల్ క్లారిటీ వచ్చి…అనవసరంగా జరుగుతున్న రాద్ధాంతానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టు అయింది.