కార్తి చిదంబరం అరెస్ట్.. ఎయిర్‌పోర్టులోనే.. - MicTv.in - Telugu News
mictv telugu

కార్తి చిదంబరం అరెస్ట్.. ఎయిర్‌పోర్టులోనే..

February 28, 2018

అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కొడుకు కార్తి చిదంబరాన్ని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా లావాదేవీలో విదేశీ మారకద్రవ్య చట్ట నిబంధనలు తుంగలో తొక్కాడన్న అభియోగాలపై సీబీఐ  అతణ్ని అదుపులోకి తీసుకుంది.  బుధవవారం  లండన్‌ నుంచి చెన్నైకి వచ్చిన కార్తిని సీబీఐ టీఎం ఎయిర్ పోర్టులోనే పట్టుకుంది. విచారణ కోసం అతణ్ని ఢిల్లీకి తీసుకెళ్తున్నారు.కార్తి 2007లో తన తండ్రి కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు, పలుకుబడిని అడ్డుం పెట్టుకుని రూ.10 లక్షలు లంచం తీసుకున్నారని చెబుతారు.  ఎన్‌ఎక్స్‌ మీడియా లావాదేవీలో అతడు గడ్డి కరిచాడంటూ గత ఏడాది మేలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసుపెట్టింది. అయితే తనే తప్పూ చేయలేదని కార్తి చెబుతున్నారు. బీజేపీ రాజకీయ కక్షతో తనను, తన తండ్రిని ఇబ్బంది పెడుతోందన్నారు. అతడు విచారణకు సహకరించడం లేదంటూ సీబీఐ అదుపులోకి తీసుకుంది.