Kartik Aaryan hikes his fees post Bhool Bhulaiyaa 2 's success
mictv telugu

ఇండస్ట్రీ హిట్‌తో రెమ్యూనరేషన్ పెంచిన కుర్ర హీరో

May 30, 2022

Kartik Aaryan hikes his fees post Bhool Bhulaiyaa 2 's success
చాలారోజుల తర్వాత బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి ఓ హిట్ దక్కింది. అక్షయ్ కుమార్ నటించిన భూల్ భూలయ్యా సినిమాకు కొనసాగింపుగా వచ్చిన భూల్ భూలయ్యా 2 సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంటోంది. ఈ సినిమాలో హీరోగా కార్తీక్ ఆర్యన్ నటించాడు. ‘ప్యార్ కా పంచ్ నామా’, ‘లుకా చప్పీ’, ‘పతి, పత్నీ ఔర్ వో’, ‘లవ్ అజ్ కల్-2’ తదితర సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్న ఈ హీరో ఎలాంటి అండదండలు లేకుండా స్వశక్తితోనే పైకి ఎదిగాడు. అయితే భూల్ భూలయ్యా మూవీ మంచి విజయం సాధించడంతో కార్తిక్ ఆర్యన్ భారీగా పారితోషికాన్ని పెంచినట్టు తెలుస్తోంది.

గతంలో రూ. 15కోట్ల నుంచి రూ. 20కోట్ల వరకు రెమ్యునరేషన్‌గా తీసుకున్న కార్తీక్ .. ప్రస్తుతం రూ. 35కోట్ల నుంచి రూ. 40కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నాడని బీ టౌన్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. హార్రర్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీలో కియారా అధ్వానీ హీరోయిన్. అనీస్ బజ్మీ దర్శకత్వం వహించాడు. టబు, రాజ్ పాల్ యాదవ్, సంజయ్ మిశ్రా, రాజేశ్ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు.