కసబ్ కట్టిన కాషాయ దారం కుట్ర ఇదీ.. హిందూ ఉగ్రవాదమని... - MicTv.in - Telugu News
mictv telugu

కసబ్ కట్టిన కాషాయ దారం కుట్ర ఇదీ.. హిందూ ఉగ్రవాదమని…

February 18, 2020

Kasab

ముంబైలో సామాన్య ప్రజలను పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపిన ఉగ్రవాద ముష్కరుడు మళ్లీ వార్తల్లోకెక్కాడు. 2008 నవంబర్ 26న జరిగిన ఆ మారణకాండలో కసబ్ తన చేతికి చుట్టుకున్న కాషాయ దారం గుట్టు బయటికొట్టింది. ముంబైలో హిందూ ఉగ్రవాదులే దాడి చేశారని ప్రచారం చేయడానికి అతడు ఆ దారం కట్టుకున్నట్లు వెల్లడైంది. దేశంలో పెరిగిపోతున్న హిందూ ఉగ్రవాదం వల్లే ముంబైలో ఈ దాడి జరినట్లు ప్రచారం చేయాలని లష్కరే కుట్రపన్నినట్లు బయటికొచ్చింది. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా రాసిన ‘’లెట్ మీ సే ఇట్ నౌ’ అనే పుస్తకంలో ఈ వివరాలు ఉన్నాయి. 

పుస్తకంలోని వివరాల ప్రకారం.. ఎర్రదారం హిందుత్వానికి సంకేతం కనుక మారణకాండకు తెగబడింది హిందూ ఉగ్రవాది అని లోకానికి చూపడానికి కసబ్ దాన్ని చుట్టుకున్నాడు. అంతేకాకుండా ‘సమీర్ దినేశ్ చౌదరి’ పేరుతో నకిలీ ఐడీ కార్డును తయారు చేయించుకున్నాడు. అయితే కసబ్ భారత బలగాలకు సజీవంగా దొరకడంతో అలాంటి పప్పులేవీ ఉడకలేదు. కసబ్ పోలీసులకు ఉగ్రవాదుల సమాచారం చెప్పకుండా అతన్ని జైల్లోనే చంపేసేలా చూడాలని లష్కరే నాయకులు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు కాంట్రాక్టు ఇచ్చారు. కసబ్‌ను కోర్టు ఆదేశాల ప్రకారం 2010లో ఉరితీయడం తెలిసిందే.