‘కాశీ మసీదులోని హిందూ విగ్రహాల పూజకు అనుమతించండి’ - MicTv.in - Telugu News
mictv telugu

‘కాశీ మసీదులోని హిందూ విగ్రహాల పూజకు అనుమతించండి’

May 12, 2022

హిందువుల పుణ్యక్షేత్రమైన కాశీ విశ్వనాథుడి ఆలయం పక్కనే ఉన్న ఓ మసీదులోని హిందూ దేవతల విగ్రహాల కేసు కొలిక్కి వస్తోంది. జ్ఞాన్‌వాపీ మసీదులోని శృంగార్ గౌరీ, హనుమంతుడు, నందీశ్వరుడు, వినాయకుడు తదితరుల విగ్రహాలను పూజించడానికి అనుమతివ్వాలని వారణాసికి చెందిన ఐదుగురు కోర్టును కోరారు. మసీదు వెనక ఉన్న ఈ విగ్రహాల ప్రాంతాన్ని వీడియో తీయాలని సివిల్ కోర్టు స్థానిక అధికారులను ఆదేశించింది. అయితే అది మత స్థలం కనుక అలాంటి ఆదేశాలు ఇవ్వకూడదని మసీదు యజమానులు వాదించారు. వీడియోగ్రఫీ కోసం నియమించిన అడ్వొకేట్ కమిషనర్ పక్షపాతవైఖరితో పనిచేస్తున్నారని అంజుమన్ ఇంతిజామియా కమిటీ ఆరోపించింది. అతనికి బదులు మరో లాయర్‌తో తనిఖీ చేపట్టాలని కోరింది. తనిఖీ చేయడానికి వెళ్లిన అధికారులను అడ్డుకుంది. అయితే కమిటీ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతమున్న అడ్వొకేట్ జనరలే కొనసాగుతారని, ఆయనకు మరో ఇద్దరు అడ్వొకేట్లు సాయం చేయాలని ఆదేశించింది. ఈ నెల17కల్లా నివేదికను తమకు అందించాలని స్పష్టం చేసింది. 17వ శతాబ్దిలో ఔరంగజేబు కాశీ ఆలయాన్ని నిర్మూలించిన ఈ మసీదును కట్టించాడు. హిందూ ఆలయ ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి.