ఏటీఎంనే ఎత్తుకుపోయిన మిలిటెంట్లు - MicTv.in - Telugu News
mictv telugu

ఏటీఎంనే ఎత్తుకుపోయిన మిలిటెంట్లు

November 22, 2017

జమ్మూకశ్మీర్‌లో  ఓ ఏటీఎం గల్లంతైంది. షోపియాన్ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన జమ్మూకశ్మీర్ బ్యాంకుకు చెందిన ఏటీఎంను మిలిటెంట్లు ఎత్తుకు పోయారు. మంగళవారం రాత్రి ముసుగులు ధరించిన వ్యక్తులు తమ వెంట తెచ్చుకున్న వాహనంలో ఏటీఎంను తీసుకుని వెళ్లారు. ఇందులో ఎంత డబ్బు ఉందో తెలియడం లేదు.కశ్మీర్‌లో గతంలోనూ మిలిటెంట్లు ఏటీఎంలను ఎత్తుకెళ్లారు. నోట్లరద్దుతో ఇబ్బందులు ఎదురు కావడంతో వారు తరచూ ఇలాంటి చోరీలకు పాల్పడుతన్నారని పోలీసులు చెబుతున్నారు.