కశ్మీరీ పండిట్ హత్యకు ప్రతీకారం.. ఇద్దరు ముష్కరుల హతం - MicTv.in - Telugu News
mictv telugu

కశ్మీరీ పండిట్ హత్యకు ప్రతీకారం.. ఇద్దరు ముష్కరుల హతం

May 14, 2022

కశ్మీరీ పండిట్, ప్రభుత్వ ఉద్యోగి అయిన రాహుల్ భట్‌ను అత్యంత కిరాతకంగా హత్య చేసిన లష్కరేతోయిబా ఉగ్రవాదులను 24 గంటలు గడవకముందే సైన్యం మట్టుబెట్టింది. బందిపొరలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు పాకిస్తానీ ఉగ్రవాదులు చనిపోయారనీ, వారికి సహకరించిన స్థానిక ఉగ్రవాది కోసం గాలిస్తున్నామని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు. ఉగ్రవాదులను ఫైజల్ అలియాస్ సికందర్, అబు ఉకాషాగా గుర్తించినట్టు తెలిపారు. గతంలో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో వీరిద్దరూ తప్పించుకున్నారని వివరించారు. కాగా, మే 11న రాహుల్ భట్‌ను పనిచేస్తున్న కార్యాలయం నుంచి ఈడ్చుకెళ్లి పాయింట్ బ్లాక్‌లో కాల్చి హత్య చేశారు. దీనిపై కాశ్మీరీ పండిట్లు పెద్ద ఎత్తున తమ నిరసనను తెలియజేశారు. ఇంతకు ముందు రాహుల్ భట్ భార్య మాట్లాడుతూ.. ఆఫీసులో పనిచేసే తోటి ఉద్యోగుల వల్లే తన భర్త ప్రాణాలు కోల్పోయాడని ఆరోపించింది.