రాజకీయాలకు షా గుడ్ బై.. 16 నెలల్లోనే.. - MicTv.in - Telugu News
mictv telugu

రాజకీయాలకు షా గుడ్ బై.. 16 నెలల్లోనే..

August 10, 2020

Kashmir politician Shah Faesal is still IAS officer, erases Twitter timeline.

ఐఏఎస్ ప‌ద‌వికి రాజీనామా చేసి మరీ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన షా ఫైజ‌ల్ అప్పుడే మనసు మార్చుకున్నారు. రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్తున్న‌ట్లు ప్ర‌క‌టించి షాక్ ఇచ్చారు. రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన సుమారు 16 నెల‌ల్లోనే ఆయ‌న రాజ‌కీయాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. జ‌మ్ము క‌శ్మీర్ పీపుల్స్ మూమెంట్స్ పార్టీ(జేకేపీఎమ్‌) అధ్య‌క్షుడి పదవి నుంచి త‌ప్పుకోవ‌డ‌మే కాకుండా.. మ‌ళ్లీ త‌న ఉద్యోగంలోకి చేర‌తున్నట్లు సమాచారం.

2010 సివిల్ స‌ర్వీస్ ప‌రీక్ష‌లో మంచి ర్యాంక్ సాధించిన షా ఫైజల్ జమ్ము కశ్మీర్ ప్ర‌భుత్వంలో ఐఏఎస్‌ ఆఫీసర్‌గా త‌న సేవ‌లు అందించారు. 2019 జ‌న‌వరిలో త‌న ఉద్యోగానికి రాజీనామా చేసి రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నట్టు ప్రకటించి సంచనలం సృష్టించారు. గ‌తేడాది మార్చి 21న  జ‌మ్ము క‌శ్మీర్ పీపుల్స్ మూమెంట్స్ పార్టీ స్థాపించారు.‌ జ‌మ్ము క‌శ్మీర్‌కు ప్ర‌త్యేక ప్రతిప‌త్తిని  క‌ల్పించే ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు స‌మ‌యంలో క‌శ్మీర్‌లోని అనేక‌మంది నేత‌ల‌తో పాటు షాను కూడా ప్ర‌జా భ‌ద్ర‌త చ‌ట్టం కింద నిర్బంధించారు. అనంత‌రం ఈ ఏడాది జూలైలో ఆయ‌న‌ను విడుద‌ల చేశారు. నిర్బంధం నుంచి విడుదల అయ్యాక ఆయన ఒక నెల తిరగకుండానే రాజకీయాలకు గుడ్ బై చెప్పడంతో ఆయన ఫాలోవర్లు షాక్‌లో పడ్డారు.