2047 నాటికి కశ్మీర్ భారత్‌లో ఉండదు..వైగో - MicTv.in - Telugu News
mictv telugu

2047 నాటికి కశ్మీర్ భారత్‌లో ఉండదు..వైగో

August 13, 2019

జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ ఆ రాష్ట్రాన్ని విభజించిన సంగతి తెలిసిందే. దీనిపై ఎండీఎంకే చీఫ్, రాజ్యసభ సభ్యుడు వి.గోపాలసామి(వైగో) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా వందవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకునే నాటికి కశ్మీర్‌ భారత్‌లో భాగంగా ఉండదని ఆయన జోస్యం చెప్పారు. 

మంగళవారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ..‘ఇండియా వందవ స్వాతంత్ర్య దినోత్సవం జరుగుపుకునే నాటికి కశ్మీర్ భారత్‌లో భాగంగా ఉండదు. బీజేపీ ప్రభుత్వం కశ్మీర్‌కు అన్యాయం చేసింది. గతంలో పాలించిన కాంగ్రెస్‌ పార్టీ కశ్మీర్‌కు 30 శాతం అన్యాయం చేస్తే.. బీజేపీ 70 శాతం చేసింది. కశ్మీర్‌పై గతంలో కూడా నా అభిప్రాయం ఇదే.. ఇప్పుడూ ఇదే చెబుతున్నా’ అన్నారు. కాగా ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్‌ విభజన సందర్భంగా పార్లమెంట్‌లో జరిగిన చర్చలో వైగో మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిందం చేసిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు.