కశ్మీర్‌లో ముష్కరుల దురాఘతం.. లాయర్‌పై కాల్పులు - MicTv.in - Telugu News
mictv telugu

కశ్మీర్‌లో ముష్కరుల దురాఘతం.. లాయర్‌పై కాల్పులు

September 25, 2020

n g vbn

కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆగడాలకు అడ్డకట్ట పడం లేదు. వరుసగా అక్కడి ప్రజల ప్రాణాలను, ప్రశ్నించే వారిని బలి తీసుకుంటూనే ఉన్నారు. ఉన్నారు. తాజాగా ఓ లాయర్‌పై కాల్పులు జరిపి చంపేశారు. బాబర్ ఖాద్రీపై శ్రీనగర్‌లోని హవాల్‌ చౌక్‌ ప్రాంతంలో తన ఇంటికి సమీపంలోనే ఈ దారుణం జరిగింది. దీంతో అంతా భయాందోళనకు గురయ్యారు. బైక్‌పై వచ్చిన ముష్కరుడు అతి సమీపం నుంచే ఈ దాడికి తెగబడ్డాడు. బుల్లెట్లు దూసుకెళ్లడంతో ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయారు. 

ఖాద్రీ తరుచూ  టీవీ చర్చల్లో పాల్గొంటూ ఉంటారు. వేర్పాటువాదులకు వ్యతిరేకంగా వ్యాసాలు రాయడం, చర్చలు జరపడం చేస్తుంటారు.  దీంతో వేర్పాటు వాదులు ఆయనపై గుర్రుగా ఉంటే వారు. ఈ క్రమంలో అతన్ని హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ నుంచి బహిష్కరించారు. అయినా కూడా తన వాదనను బలంగా వినిపిస్తూ వచ్చాడు. ఇటీవల భారత సైన్యానికి అనుకూలంగా అతడు తన ఫేస్‌బుక్‌లో షేర్ కూడా చేశారు. అప్పటి నుంచి అతనికి బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఈ ఘటనపై ఏ ఉగ్రవాద సంస్థ ఇంకా ప్రకటన చేయలేదు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్య నేపథ్యంలో భద్రతా బలగాలను భారీగా మోహరించారు.