పండిట్‌పై కశ్మీర్‌లో ఉగ్రదాడి - MicTv.in - Telugu News
mictv telugu

పండిట్‌పై కశ్మీర్‌లో ఉగ్రదాడి

April 5, 2022

x dvdfv

ఉగ్రవాదులు కశ్మీర్‌లో ఓ పండిట్‌పై దాడికి తెగబడ్డారు. సోమవారం సాయంత్రం షోపియాన్ జిల్లాలో బాల కిషన్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. దీంతో బాల కిషన్ చెయ్యి, కాలులోకి తూటాలు దిగాయి. వెంటనే స్పందించి కిషన్‌ను శ్రీనగర్‌లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు కోలుకుంటున్నాడని, ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు ప్రకటించారు. కాగా, గత నెలరోజులుగా పండిట్లపై ఉగ్ర దాడులు పెరిగిపోయాయి. వారితో పాటు స్థానికేతరులను టార్గెట్ చేస్తున్న ఉగ్రవాదులు.. వరుస ఘటనలకు పాల్పడుతున్నారు. రెండ్రోజుల్లో ఇది నాలుగో దాడి. పుల్వామాలో ఇద్దరు వలస కూలీలపై దాడులు చేయగా, వాళ్లిద్దరూ గాయపడ్డారు. తర్వాత కొద్దిసేపటికే సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి చేయగా, ఒకరు చనిపోయి, మరొకరు గాయపడ్డారు. వరుసగా జరుగుతున్న దాడులపై స్థానికేతరులు ఆందోళన చెందుతున్నారు.