యాసిన్ మాలిక్‌ను దోషిగా తేల్చిన కోర్టు.. 25 న శిక్ష ఖరారు - MicTv.in - Telugu News
mictv telugu

యాసిన్ మాలిక్‌ను దోషిగా తేల్చిన కోర్టు.. 25 న శిక్ష ఖరారు

May 19, 2022

ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం అందించిన కేసులో కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ దోషిగా తేలాడు. ఢిల్లీలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు యాసిన్ మాలిక్‌ను ఈ కేసులో దోషిగా తేల్చింది. అయితే ఈ కేసులో మే 25వ తేదీన శిక్ష‌ను ఖ‌రారు చేయ‌నున్నారు. మాలిక్ ఆర్థిక ప‌రిస్థితిని ఎన్ఐఏ అంచ‌నా వేయ‌నున్న‌ది. త‌న‌కు ఉన్న ఆస్తుల‌పై అఫిడ‌విట్‌ను స‌మ‌ర్పించాల‌ని మాలిక్‌ను కోర్టు ఆదేశించింది. మాలిక్‌తో పాటు ష‌బ్బీర్ షా, ర‌షీద్ ఇంజినీర్‌, అల్తాప్ ఫంతూష్‌, మ‌స్రాత్‌ల‌కు ఉగ్ర నిధులు అందిన‌ట్లు విచార‌ణ‌లో తేలింది.

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద, చట్టవ్యతిరేక కార్యకలాపాల కోసం మాలిక్‌.. ‘ఫ్రీడమ్‌ స్ట్రగుల్‌’ పేరుతో నిధుల సమకూర్చడమే కాక అందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఓ ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో అతడిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో మాలిక్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశాలున్నట్లు సమాచారం. మే 10న యాసిన్‌ మాలిక్‌ తనపై నమోదైన అన్ని కేసుల్లో కోర్టు ఎదుట నేరాన్ని అంగీకరించాడు.