శ్రీలంక క్రికెటర్ చెత్త రికార్డ్ ఇదే..! - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీలంక క్రికెటర్ చెత్త రికార్డ్ ఇదే..!

October 28, 2019

క్రికెట్‌లో శ్రీలంక ఆటగాడు కసున్ రజిత అత్యంత టీ20 చరిత్రలో చెత్త ప్రదర్శనతో రికార్డు సాధించాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 75 పరుగులు ఇచ్చాడు. ఆస్ట్రేలియా- శ్రీలంకమధ్య జరుగుతున్న  మూడు టీ20 సిరీస్‌‌లో భాగంగా ఆదివారం ఆడలైట్‌లో తొలి మ్యాచ్ నిర్వహించారు. దీంట్లో కసున్ వేసిన బౌలింగ్‌కు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ వార్నర్‌, కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ పరుగుల వరద పారించారు. భారీ స్కోర్‌ను చేధించలేక అతి తక్కువ పరుగులకే అలౌటై శ్రీలంక తొలి మ్యాచ్ చేజార్చుకుంది. 

Sri Lanka.

కసున్ వేసిన మొదటి ఓవర్‌లో 11 పరుగులు రాగా రెండో ఓవర్‌లో 21 పరుగులు, మూడో ఓవర్‌లో 25 పరుగులు, నాలుగో ఓవర్‌లో 18 పరుగులు ఇచ్చాడు. అయితే ఈ మ్యాచ్‌లో అతడు ఒక్క వికెట్ కూడా తీయకపోవడం ఇక్కడ మరో విశేషం.  కాగా ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 234 పరుగుల లక్ష్యాన్ని ఉంచగా.. శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 99 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఆసీస్ 134 పరుగుల తేడాతో విజయం సాధించింది.