ఆల్ ది బెస్ట్ కత్తి కార్తీక ! - MicTv.in - Telugu News
mictv telugu

ఆల్ ది బెస్ట్ కత్తి కార్తీక !

July 17, 2017

‘ మీరు మస్త్ మాట్లాడ్తర్లే, మంచిగున్నర, ఎట్లున్నరు.., ’ వంటి మస్త్ మస్త్ తెలంగాణా భాషలో హైదరాబాదీని మిక్స్ చేసిన నయా ప్రెజెంటేషన్ , గిలిగింతలు పెట్టే డిఫరెంట్ యాంకరింగ్, దిల్ పసంద్ బాతేం.., ఇలాంటివెన్నో ఛమక్కు మాటలు కేవలం ‘ కత్తి కార్తీక ’ మాత్రమే మాట్లాడగలదు. తన గురించి చెప్పాలంటే ప్రయోక్తలకు కొత్త సెలబస్ ను నేర్పిందనే చెప్పొచ్చు. తన యాంకరింగ్ తో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న తను ఇప్పుడు ‘ బిగ్ బాస్ ’ షోలో పాటిస్పైట్ చేస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ కూడా కార్తీకను చాలా చక్కగా రిసీవ్ చేస్కున్నాడు. కార్తీక కూడా ఎన్టీఆర్ ను ‘ అన్నా ’ అని సంబోధిస్తూ మాట్లాడిన తీరు చాలా మందిని ఆకట్టుకుంది. అలాగే ఎన్టీఆర్ నటించిన ‘ నాన్నకు ప్రేమతో ’ సినిమా బాగుందని చెప్పింది. తన తదుపరి సినిమా ‘ అమ్మకు ప్రేమతో ’ చేస్తున్నట్టు చెప్పాడు ఎన్టీఆర్. అంటే తప్పకుండా ఈ షో ఒక న్యూ ప్రెజెంటేషన్ను ఆవహించుకుంటుందని చెప్పొచ్చు. సో.. కత్తి కార్తీకకు హార్ట్ ఫుల్ గా ఆల్ ది బెస్ట్ చెబుదామా !