కత్తి కార్తీకకు ఎన్ని ఓట్లు వచ్చాయంటే..  - MicTv.in - Telugu News
mictv telugu

కత్తి కార్తీకకు ఎన్ని ఓట్లు వచ్చాయంటే.. 

November 10, 2020

దుబ్బాక ఉప ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్ల తర్వాత ఎక్కువగా వినిపించిన పేరు కత్తి కార్తీక. టీవీ యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ అయిన కార్తీక నియోజక వర్గంలో విస్తృత ప్రచారం చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలను తీవ్రంగా విమర్శించారు. బహుజన సెంటిమెంట్లతోనూ ప్రచారం చేశారు. అయినా ఆమెకు నిరాదరణే ఎదురైంది. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థికగా బరిలోకి దిగిన కార్తీకకు 620 ఓట్లు దక్కాయి. కొన్ని రౌండ్లలో ఆమెకు ‘నోటా’ కంటే తక్కువ ఓట్లు రావడం వార్తగా మారింది. 

కార్తీక తొలి నుంచి ప్రచారం చేసిన పెద్ద పార్టీలకు పోటీ ఇవ్వడం ఆమెకు సాధ్యం కాలేదు. తగినన్ని వనరులు లేకపోయినా ఒక మహిళ ఆత్మవిశ్వాసంతో ముందుకు రావడం ఆసక్తి కలిగించింది. ప్రచార ఘట్టం చివరి దశలో ఆమెపై భూకబ్జా ఆరోపణలు రావడం తెలిసిందే.