కత్తి మహేశ్‌పై దాడి.. రాముడిపై వ్యాఖ్యల ఎఫెక్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

కత్తి మహేశ్‌పై దాడి.. రాముడిపై వ్యాఖ్యల ఎఫెక్ట్

February 14, 2020

Kathi Mahesh.

ప్రముఖ సినీ విమర్శకుడు, దళిత మేధావి కత్తి మహేశ్‌పై దాడి జరిగింది. ఆయన ఇటీవల శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తులు కారుపై దాడి చేశారు. ఐమాక్స్ థియేటర్ కు వచ్చిన కత్తి కారుపై కర్రలతో దాడి చేశారు. దీంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆయన సురక్షితంగా తప్పించుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.దాడి చేసిన వారిని బజరంగ్ దళ్‌కు చెందిన రాజ్ కుమార్, వెంకట్, సాయి రాజుగా పోలీసులు గుర్తించారు.

రాముడు నెమలి తొడ తినేవాడని, అంత:పురంలో ఎంజాయ్ చేసేవాడు అని కత్తి ఇటీవల సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. దీంతో కొందరు ఆయనపై కేసులు పెట్టారు. తనకు బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని అతడు చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌పై విమర్శలతో వెలుగులోకి వచ్చిన కత్తి మహేశ్ సోషల్  మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. పరిపూర్ణానంద స్వామితో వివాదం వల్ల తెలంగాణ పోలీసులు అతణ్ని హైదరాబాద్ నుంచి ఆరు నెలలు బహిష్కరించారు.