జనసేన కులపిచ్చిగాళ్ల పార్టీ... - MicTv.in - Telugu News
mictv telugu

జనసేన కులపిచ్చిగాళ్ల పార్టీ…

December 9, 2017

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను ప్రశ్నిస్తూనే ఉంటానన్న సినీ విమర్శకుడు కత్తి మహేశ్ అదే పనిగా పెట్టుకున్నట్టు ఉన్నారు. ఫేస్‌బుక్, ట్విటర్లలో గంటగంటలకూ అన్నట్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పవన్‌కు బుర్రలేదని, జనసేన కులపిచ్చిగాళ్ల పార్టీ అని తీవ్ర విమర్శలు చేశారు. ఈసీ నిబంధనల ప్రకారం.. చూస్తే ఒక పార్టీకి ఉండాల్సిన లక్షణాలేవీ జనసేనకు లేవని వివరించారు.  ఒకపక్క జగన్ చేస్తున్న పాదయాత్రపై పవన్ విమర్శలు, పవన్ చేస్తున్న పర్యటనలపై కత్తి విమర్శలతో నెటిజన్లకు చక్కని కాలక్షేపం అవుతోంది.

`రూల్స్ ప్ర‌కారం చూసుకుంటే జ‌న‌సేన అస‌లు పార్టీయే కాదు. కేవ‌లం ట్విట‌ర్ పార్టీ. రాజ‌కీయ పార్టీ కావడానికి కావాల్సిన బేసిక్ అర్హ‌త‌లు లేని పార్టీ. చంద్ర‌బాబుగారు ద‌య‌తో కొన్ని సీట్లు కేటాయించి వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా హోదా క‌ల్పించ‌క‌పోతే మ‌రో జ‌న‌రేష‌న్ యూత్ వెర్రివెంగ‌ల‌ప్ప‌లుగా మిగిలిపోతారు. జ‌నం లేరు. సేన లేదు. పిచ్చి అభిమానులు, కుల పిచ్చిగాళ్లు మాత్రం ఉన్నారు` అని కత్తి ఒక పోస్ట్ పెట్టారు.

మరో పోస్ట్‌లో.. ‘ప్ర‌తీదానికీ చంద్ర‌బాబుకు తెలియ‌క‌పోవ‌చ్చు అంటావేంట‌య్య బాబూ.. ఆయ‌న ముఖ్య‌మంత్రి కాడా లేక అంత ప‌నికిమాలిన వాడు అని నీ అభిప్ర‌యమా? లేక ఎలా వెనుకేసుకురావాలో అర్థం కావ‌డం లేదా? నీకు స్పెష‌ల్ స్టేష‌స్ అంటే జోకైపోయింది. మీ దోస్త్ చంద్ర‌బాబు.. స్పెష‌ల్ ప్యాకేజీకి, ప్ర‌త్యేక హోదాకు తేడా లేద‌నేస్తాడు. అస‌లు ఒక్క విష‌యం మీదైనా నీకు క్లారిటీ ఉందా! ఆ క్లారిటీ లేద‌నే విషయం అయినా నీకు క్లియ‌ర్‌గా అర్థ‌మ‌వుతోందా`  అని అన్నారు.

మరో పోస్టులో..  ‘స్పెషల్ స్టేటస్ అంటే జోకైపోయింది. వైజాగ్ రమ్మని పిలుపినిచ్చావ్. నువ్వు మాత్రం రాలేదు. మీ దోస్త్ చంద్రబాబు స్పెషల్ ప్యాకేజికి, స్టేటస్ కి తేడాలేదు అనేస్తాడు. నువ్వు మళ్ళీ స్టేటస్ కావాలంటే పోరాడాలి అంటావు. మేము రెడీ అంటే, ముందు నేను పోరాడతా అంటావ్. అసలు ఒక్క విషయం మీద అయినా క్లారిటీ ఉందా! ఆ క్లారిటీ లేదనే విషయం అయినా క్లియర్గా అర్థం అవుతోందా?..

మతతత్వ శక్తులతో చేతులు కలిపే చేగువేరా దొంగ అభిమాని. నేను కులాన్ని నమ్మను అంటూనే కమ్మ-కాపు స్నేహం కావాలి క్యాపిటల్ (దోచుకోవడం)కోసం అనే అంబేద్కర్ లిప్ సర్విస్ వాది. నమ్మినవాళ్లను నట్టేట ముంచేసిన అన్నకు మద్దతుగా కక్ష సాధింపు పార్టీ పెట్టే సూడో ప్రజాస్వామ్య వాది. రాజకీయాల్లోకి రాలేదు రాలేదు అంటూనే ఇన్ని నాటకాలు. ఇక వస్తే…అయినా క్లియర్గా అర్థం అవుతోందా?..’ ఇలా సాగుతున్నాయి కత్తి కామెంట్లు