పవన్ కల్యాణ్‌కు కత్తి మహేశ్ మద్దతు.. - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ కల్యాణ్‌కు కత్తి మహేశ్ మద్దతు..

February 7, 2018

నిన్నమొన్నటి వరకు పవన్ కల్యాణ్‌కు సవాళ్లపైన సవాళ్లు విరిసిన సినీ విమర్శకుడు కత్తి మహేశ్ ఏమైందో ఏమోగాని బాగా బాగా వెనక్కి తగ్గాడు. ‘రాజీ’ వ్యవహారం తర్వాత పవన్ పై బోల్డంత ప్రేమ చూపిస్తున్నారు. తాను పవన్ కల్యాణ్ చేయబోయే దీక్షకు మద్దతు ప్రకటిస్తున్నాట్లు కత్తి తన ట్విటర్ ఖాతాలో తెలిపాడు.

‘ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం ఈ నెల 21 నుంచీ న్యూఢిల్లీ లోని జంతర్ మంతర్ లో ఆమరణ నిరాహారదీక్ష చేయనున్న జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ కు నా మద్దత్తు తెలుపుతున్నాను’ అని కత్తి ట్వీట్ చేశారు. బడ్జెట్, లోక్ సభలో మోదీ ప్రసంగంపై స్పందిస్తూ.. ‘అధ్యయనం అయిపోయి ఉంటే, బడ్జెట్ మీద మోడీ గారికి ఒక అఫీషియల్ గా ఒక లెటరో, ట్విట్టర్ లో ఒక ట్విట్టో చేస్తే, కాస్త తెలుగువాడి ఆత్మగౌరవానికి మీరు గౌరవం ఇచ్చినట్టు. పవన్ కళ్యాణ్ గారూ… వింటున్నారా!’ అని మరో ట్వీట్ చేశారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం దీక్షకు సంబంధించి ఇంతవరకు వివరాలు వెల్లడించలేదు. కేంద్ర బడ్జెట్ లో తమకు తగినన్ని నిధులు ఇవ్వలేదని, ప్రత్యేక హోదాకు గండికొట్టారని ఏపీకి చెందిన టీడీపీ, వైకాపా ఎంపీలు పార్లమెంటును అట్టుడికిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కల్యాణ్ ఈ అంశంపై ఇంతవరకు స్పందించలేదు. విమర్శలను తిప్పికొట్టేందుకే ఆయన ఢిల్లీలో దీక్ష చేస్తున్నట్లు భావిస్తున్నారు.