తెలంగాణ యాస,భాషను నేర్పిస్తున్న కత్తి కార్తీక..! - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ యాస,భాషను నేర్పిస్తున్న కత్తి కార్తీక..!

August 14, 2017

బిగ్ బాస్ షోలో తెలంగాణ భాషతో అందరిని ఆకట్టుకుంటుంది కత్తి కార్తీక,జూనియర్ ఎన్టీఆర్ కూడా ..ఆమెతో మాట్లాడిన ప్రతిసారి తెలంగాణ యాసలోనే మాట్లాడుతున్నారు.అయితే తాజాగా  జూనియర్ ఎన్టీఆర్  దీక్షను నీకు తెలుగు పూర్తిగా రాదుకదా మరి నేర్చుకుంటున్నావా అని అడిగితే ,ఆ అవును తెలుగుతో పాటు తెలంగాణ భాషను కత్తి కార్తీక దగ్గర నేర్చుకుంటున్నానని దీక్ష జూనియర్ ఎన్టీఆర్ కు చెప్పింది.

ఏం నేర్చుకున్నవ్ అని జూనియర్ ఎన్టీఆర్ అడిగితే ఇప్పటికైతే దవుడ పల్గుతది,ఈపు పల్గుతది అనే మాటలు  నేర్చుకున్నా అని దీక్ష చెప్పగానే జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారిగా నవ్వారు,ఓకే ఒకే గుడ్ గుడ్ మంచిగ నేర్చుకో అని దీక్షకు చెప్పాడు.