పబ్‌జీ పూర్తి పేరు తెలుసా?..కేబీసీలో అమితాబ్ ప్రశ్న - MicTv.in - Telugu News
mictv telugu

పబ్‌జీ పూర్తి పేరు తెలుసా?..కేబీసీలో అమితాబ్ ప్రశ్న

August 21, 2019

Kaun Banega Crorepati.

నేటి యువతను ఎంతగానో ఆకట్టుకున్న పబ్‌జీ గేమ్‌ గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. దీన్ని ఆడేందుకు యువత ఎంతగా ఆసక్తి చూపుతారో అందరికీ తెలిసిందే. అయితే దీని పూర్తి పేరు మీకు తెలుసా? ఇప్పుడు ఈ విషయం ఎందుకు అంటారా? ప్రముఖ నటుడు, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించే కౌన్‌బనేగా కరోడ్‌పతి 11వ సీజన్ రెండో ఎపిసోడ్‌లో ఈ ప్రశ్న అడిగారు. అప్పటి నుంచి ఇది సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివేక్‌ భగత్‌ అనే వ్యక్తిని ‘పబ్‌ జీ పూర్తి పేరు తెలుసా’ అనే ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానం తెలియని భగత్ ఆడియన్స్‌ పోల్ లైఫ్‌లైన్‌ తీసుకోవాల్సి వచ్చింది. ‘ప్లేయర్‌ అన్‌నోన్స్‌ బ్యాటిల్‌ గ్రౌండ్స్‌’ అనే సమాధానానికి ఎక్కువ మంది ఓటేయడంతో సరైన సమాధానం చెప్పగలిగారు. ఈ ప్రశ్న అడిగిన తర్వాత చాలా మంది వీక్షకులు పబ్జి పూర్తి పేరుకోసం ఇంటర్నెట్‌లో ఎక్కువగా వెతికారట. దీనిపై సోషల్‌మీడియాలో కూడా చర్చ జరిగింది.