ఎంతో ఆసక్తిగా సాగుతున్న బిగ్‌బాస్ 2 షో అఖరి గట్టానికి చేరింది. బిగ్‌బాస్ షో విన్నర్ ఎవరని ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 17మందితో మొదలైన షోలో ప్రస్తుతం ఐదుగురు సభ్యులు ఫైనల్స్‌కు చేరారు. కౌశల్, తనీశ్, గీతా మాధురి, సామ్రాట్, దీప్తి ఫైనల్స్‌లో ఉన్నారు. ప్రేక్షకుల నుంచి ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే విజేతగా నిలిచే అవకాశం ఉంది. ప్రతి వారం ఎలిమినేషన్ నుంచి కౌశల్‌ను కాపాడుతోంది ఆర్మీ. ఓట్లు లెక్కన విన్నర్ ఎవరనేది ఎంపిక చేస్తే కౌశల్‌ను గెలిపించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తోంది.ఈ నేపథ్యంలో కౌశల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు బిగ్ బాస్ 1 కంటెస్టెంట్, సినీ విమర్శకుడు కత్తి మహేశ్. హౌస్‌లో ఇటీవల జరిగిన గొడవ వల్ల ‘కౌశల్ అంతా కోల్పోయాడు. అతణ్ణి హౌస్ నుంచి బయటకు గెంటేయండి’ అంటూ కత్తి ట్వీట్ చేశారు. శనివారం నాని కౌశల్‌ని ప్రశ్నించిన నేపథ్యంలో ‘చాలా పేలవమైన, విసుగుపుట్టించే సమాధానం చెప్పాడు కౌశల్. బిగ్‌బాస్ చరిత్రలోనే చాలా చిరాకు తెప్పించే వ్యక్తి’ అని ట్వీట్ చేశారు. తాజాగా మరో ట్వీట్ చేశాడు. కత్తి మహేశ్ ‘కౌశల్ బిగ్‌బాస్ 2లోనే చాలా విసుగు తెప్పించే వ్యక్తి. ఒకవేళ అతను బిగ్‌బాస్ 2 గెలిస్తే మనమెంత ఇడియట్స్ అనేది ప్రూవ్ అవుతుంది’ అని పేర్కొన్నాడు.
దీప్తి నల్లమోతు తరుపున క్యాంపెయిన్ నిర్వహిస్తున్నానని కత్తి మహేశ్ ఫేస్బుక్ ద్వారా తెలిపాడు. కత్తిపెట్టిన పోస్ట్‌పై ఓ యువతి స్పందిస్తూ.. ‘ప్రజలు ఎవరిని ఇష్టపడితే మీరు ఎందుకు వారినే టార్గెట్ చేస్తారు?’ అని ప్రశ్నించింది. దీనికి కత్తి తనకు ప్రజల ఒపీనియన్ తో సంబంధం లేదని తన దారిలో తాను వెళ్తానని తెలిపాడు.