కౌశల్ కోసం వేలమంది.. Rx100 హీరోనూ పట్టించుకోలేదు - MicTv.in - Telugu News
mictv telugu

కౌశల్ కోసం వేలమంది.. Rx100 హీరోనూ పట్టించుకోలేదు

October 4, 2018

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్‌కు జనంలో విపరీతమైన క్రేజ్ పెరిగింది. అతని పేరిట ఆర్మీతో పాటు అభిమానులు కూడా పెరిగిపోయారు. గురువారం హైదరాబాద్ సుచిత్ర ప్రాంతంలోని కేఎల్‌ఎం ఫ్యాషన్ మాల్‌ను ప్రారంభించేందుకు కౌశల్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. దీంతో అతణ్ణి చూసేందుకు అభిమానులు, జనం వేల సంఖ్యలో తరలివచ్చారు.

https://youtu.be/op9Ug7ZkYeY

షాపింగ్ మాల్ వద్ద గుమిగూడిన జనం కౌశల్.. కౌశల్ అంటూ నినాదాలు చేశారు. దీంతో కారులో ఉన్న కౌశల్ బయటకు వచ్చి అభిమానులందరికీ అభివాదం చేశారు. వారి ప్రేమతో భావోద్వేగానికి లోనయ్యాడు. సుమారు అరగంట పాటు అతడు షాపింగ్ మాల్ బయటే అభిమానులను చూస్తూ ఉండిపోయాడు. స్టార్ హీరో వచ్చినట్లు జనం ఎగబడ్డం మీడియాను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.

షాపింగ్ మాల్ ప్రారంభానికి కౌశల్‌తో పాటు ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన ‘ఆర్‌ఎక్స్ 100’ చిత్ర హీరో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ కూడా వచ్చారు. కానీ జనం వారిని పట్టించుకోలేదు. ఆ ప్రాంతమంతా కౌశల్ నినాదాలతో మార్మోగింది.