ఆర్మీకి థాంక్స్ చెప్పిన కౌశల్… - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్మీకి థాంక్స్ చెప్పిన కౌశల్…

October 1, 2018

బిగ్‌బాస్ సీజన్2 విజేతగా కౌశల్ నిలిచిన విషయం తెలిసిందే. చివరి ఎపిసోడ్ చాలా ఉత్కంఠగా సాగింది. అప్పటికీ జనాల్లో విన్నర్ కౌశలే అవుతాడనే సంకేతాలతో వున్నారు. అతని విజయం వెనుక కౌశల్ ఆర్మీ చాలా కీలక పాత్ర పోషించిందని తెలుస్తోంది. కాగా బిగ్‌బాస్2 టైటిల్ గెలుచుకుని బయటకు వచ్చిన కౌశల్‌ను అతని ఆర్మీ చుట్టుముట్టారు. టపాకాయలు కాల్చి సందడి చేశారు. అభిమానంతో అరుపులు, కేకలు పెట్టారు. కౌశల్ కారు పైకి ఎక్కి తనను అభిమానుస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పాడు.Kaushal thanks to armyతనకు బయట ఇంత ఫాలోయింగ్ వుండటం తన అదృష్టం అన్నాడు కౌశల్. తనను గెలిపించడానికి మీరంతా పడిన తాపత్రయానికి పేరుపేరునా అందరికీ ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అన్నాడు. క్రింది వీడియోలో మీరూ చూడవచ్చు.

కౌశల్ నిజాయితీగా గెలిచాడు.. కోన వెంకట్

ఇదిలా వుండగా కౌశల్ గెలుపుపై సినీరచయిత కోన వెంకట్ స్పందించారు. ఇది కౌశల్ గెలుపు కాదని, కులమతాలకు అతీతంగా కౌశల్ వెంట నిలిచి మద్దతు పలికిన అభిమానులదని ఆయన అన్నాడు. కౌశల్ చాలా నిజాయితీగా ఆడి గెలిచాడని అని తన ట్విటర్ ద్వారా తెలిపారు.  

నిజాయితీ కలిగుంటే, ప్రజలు తప్పకుండా మద్దతిస్తారు. ఇంతటి ప్రజాభిమానానికి కౌశల్ అర్హుడేనని చెప్పారు. బిగ్‌బాస్ – 2 గెలుపు కౌశల్ ఆర్మీదేనని పేర్కొన్నారు.