Mlc Kavitha: నేడు ఈడీ ఎదుట హాజరు కానున్న కవిత. ఢిల్లీ చేరుకున్న బీఆర్ఎస్ నేతలు.. - MicTv.in - Telugu News
mictv telugu

Mlc Kavitha: నేడు ఈడీ ఎదుట హాజరు కానున్న కవిత. ఢిల్లీ చేరుకున్న బీఆర్ఎస్ నేతలు..

March 11, 2023

ఢిల్లీ లిక్కర్ స్కాం దేశవ్యాప్తంగా హాట్ టాపిగ్గా మారింది. ఈ స్కాంలో మొదట్నుంచీ ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు ఉదయం 11 గంటలకు ఈడీ ఎదుట హాజరు కానున్నారు. కవిత ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలంటూ శుక్రవారం కవిత జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. దీక్ష ముగిసిన వెంటనే కవిత న్యాయ నిపుణులతో చర్చించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు హస్తినకు చేరుకున్నారు.

అటు ఈ స్కాంలో ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కోర్టు ఏడు రోజుల కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మనీష్ సిసోడియా రిమాండ్ రిపోర్టులోనూ ఈడీ కీలక విషయాలను వెల్లడించింది. రిమాండ్ రిపోర్టులో కవిత పేరును మరోసారి ప్రస్తావించింది ఈడీ. సౌత్ లాబీల గురించిన పలు విషయాలను రిపోర్టులో పేర్కొంది. మొత్తం 9 గ్రూపులను సౌత్ గ్రూపు కైవసం చేసుకుందని ఢిల్లీ లిక్కర్ స్కాం హైదరాబాద్ లోనే జరిగినట్లు ఈడీ తెలిపింది. ఈ కుట్ర మొత్తంగా ఐటీసీ కోహినూర్ హోటల్లో జరిగినట్లు ఈడీ ప్రస్తావించింది.

కాగా కవితకు ఈడీ నోటిసులపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం కవితను అరెస్ట్ చేసే అవకాశం ఉందని..చేస్తే చేసుకోని అంటూ వ్యాఖ్యానించారు. జైల్లో పెడతారు అంతే కదా…దానికి భయపడాల్సిన అవసరమే లేదు. బీజేపీలో చేరని వారిని ఈవిధంగా వేధిస్తున్నారని…కవితను కూడా బీజేపీలో చేరమని అడిగిరాని కేసీఆర్ అన్నారు. ఇక మంత్రి కేటీఆర్ ఢిల్లీకి పయనమయ్యారు. శనివారం, ఆదివారం రెండు రోజులు అక్కడే ఉంటారు. న్యాయ నిపుణులతో భేటీ అవుతారు.