4,50,000 women enrolled for Kcr kit till date & 65000 women already received the kits.Great feedback from happy mothers.Jai Telangana !!! pic.twitter.com/qr1bdAvF99
— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 16, 2017
తల్లీబిడ్డల క్షేమం కోసం అని తెలంగాణల సీెం కేసీఆర్ కిట్ల పథకాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం మొన్ననే రెండు అవార్డులు కూడా గెలుచుకుంది. ఈ పథకానికి వేరే రాష్ట్రాల నుంచి కూడా విశేష ఆదరణ లభిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఇటువంటి కిట్లను అమలు చేయడానికి అక్కడి ప్రభుత్వాలు చొరవ తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ పథకానికి అర్హులైన 4,50,000 మంది గర్భిణులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని ఎం.పి కవిత తన ట్విట్టర్లో పోస్టు పెట్టారు. ఇప్పటి వరకు కేసీఆర్ కిట్లను 65,000 మంది బాలింతలు అందుకున్నారని తెలిపారు.. ఈ పథకంపై తెలంగాణ తల్లుల నుంచి మంచి స్పందన వస్తుందని, కేసీఆర్కు రుణపడి ఉంటామని చెబుతూ.. తల్లులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని కవిత ట్వీట్ చేశారు.