కేసీఆర్‌కు ముందే తెలుసు : మంత్రి సబితా - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్‌కు ముందే తెలుసు : మంత్రి సబితా

April 4, 2022

10

వరి కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరు గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ముందే తెలుసని విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా మహేశ్వరంలో నిర్వహించిన నిరసన దీక్షలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంతా మంత్రి మాట్లాడుతూ.. వరి వేయొద్దని కేసీఆర్ చెప్పినా కూడా, బీజేపీ నేతలు రెచ్చగొట్టి రైతుల చేత వరి పంట వేయించారని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేసేలా మేం చేస్తామని బీజేపీ నేతలు చెప్పారని, కానీ, ఇప్పుడు పట్టించుకోవట్లేదని విమర్శించారు. అయినా కేంద్రాన్ని వదిలేసే ప్రసక్తే లేదని, ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని వెల్లడించారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలను ఆ పార్టీ శ్రేణులు నిర్వహిస్తున్నారు.