ఏపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం.. కారణం ఇదే  - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం.. కారణం ఇదే 

May 12, 2020

KCR Angry on Andhra Pradesh Government

ఏపీ ప్రభుత్వం తీరుపై తెలంగాణ సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. శ్రీశైలం జలాల ఎత్తిపోతలతో కొత్త ప్రాజెక్టు నిర్మించాలన్న ప్రతిపాధనపై ఆయన అభ్యంతరం చెప్పారు. దీన్ని కచ్చితంగా అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం ఏక పక్షంగా వ్యవహరించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టును ఆపాలంటూ కృష్ణా వాటర్ మేనేజ్ మెంట్ బోర్డులో రాష్ట్రం తరఫున ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయం తనను బాధించిందని పేర్కొన్నారు. గతంలోని వివాదాలను పక్కనపెట్టి కొత్త ప్రభుత్వానికి స్నేహ హస్తం అందిస్తే తమను కనీసం సంప్రదించేది లేదా అంటూ ప్రశ్నించారు. 

శ్రీశైలం నుంచి కృష్ణా జలలాను ఎత్తిపోస్తూ కొత్త ప్రాజెక్టు నిర్మించేలా ఇటీవల ఏపీ ప్రభుత్వం కొత్త జీవోను తెచ్చింది. 3 టీఎంసీల నీటి సామర్థ్యంతో దీనికి రూపకల్పన చేయాలని నిర్ణయించారు. అయితే పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఎవరూ దీనిపై చర్చించలేదు. దీంతో ఇది విభజన చట్టానికి విరుద్ధమని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. అపెక్స్‌ కమిటీ ఆమోదం లేకుండా నిర్ణయం తీసుకొని తప్పుచేశారంటూ కేసీఆర్ మండిపడ్డారు. తమ రాష్ట్రానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఏ కొత్త నిర్మాణమైనా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించే తీసుకోవాలని సూచించారు.