బీఆర్ఎస్ తొలి బహిరంగ సభకు వేదికైన ఖమ్మంపై సీఎం కేసీఆర్ వరాల వర్షం కురిపించారు. గ్రామపంచాయితీలపై, మునిసిపాలిటీలపై కోట్ల నిధులు కుమ్మరించారు. ‘ఖమ్మం మునిసిపాలిటీకి రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నాం. గతంలో తుమ్మ నాగేశ్వరరావు, ఇప్పుడు మంత్రి అజయ్ గారు ఖమ్మాన్ని బాగా అభివృద్ధి చేశారు. మున్నేరు నదిపై పాత బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి శాంక్షన్ చేస్తాం. ఖమ్మంలో ప్రభుత్వ ఇంజినీరు కాలేజీలో కొత్త కొర్సోలతో మంజూరు చేస్తాం. జిల్లాలోని ప్రతి జర్నలిస్టులకు నెలరోజుల్లో ఇళ్ల స్థలం ఇస్తాం. . మేజర్ గ్రామపంచాయతీలకు రూ.10 కోట్లు ఇస్తాం. మధిర, వైరా, సత్తుపల్లి ఇతర మున్సిపాల్టీలకు రూ.30 కోట్ల చొప్పున ఇస్తాం’’ అని ఆయన చెప్పారు.