Home > Featured > తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్‌గా వినయ్ భాస్కర్.. 

తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్‌గా వినయ్ భాస్కర్.. 

KCR appoints trs.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వ చీఫ్ విప్, విప్ పదవులను భర్తీ చేశారు. చీఫ్ విప్‌గా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు దాస్యం వినయ్ భాస్కర్ నియమతులయ్యారు. విప్‌లుగా ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గంప గోవర్ధన్, గువ్వల బాలరాజు, అరెకపూడి గాంధీ, రేగ కాంతారావు, బాల్క సుమన్‌లను నియమించారు. అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా పనిచేసిన కొప్పుల ఈశ్వర్‌ను కేసీఆర్ తన కేబినెట్‌లోకి తీసుకోవడం ఆ పదవి ఖాళీ అయింది. కొత్త చీఫ్ విప్ వినయ్ వరంగల్ పశ్చిమ స్థానం నుంచి మూడుసార్లు (2009, 2014, 2018) గెలిచారు. సీఎంవోలో పార్లమెంట్ కార్యదర్శిగా విధులు నిర్వహించారు. ఆలేరు ఎమ్మెల్యే సునీత కూడా గతంలో విప్‌గా ఉన్నారు. పినపాక ఎమ్మెల్యే కాంతారావు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచి తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు.

Updated : 7 Sep 2019 9:43 AM GMT
Tags:    
Next Story
Share it
Top