స్టార్ షట్లర్ పీవీ సింధు బుధవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ను కలిశారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో రజత పతకం గెలిచిన పీవీ సింధును ముఖ్యమంత్రి సత్కరించారు. భవిష్యత్తులో భారత్కు మరిన్ని పతకాలు సాధించాలని సూచించారు. సింధు కోచ్ గోపిచంద్ ను కూడా అభినందిస్తూ.. దేశానికి ఇలాగే పేరు తెచ్చేలా మరింత మంది క్రీడాకారులను తీర్చిదిద్దాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్.. పీవీ సింధుకు పలు కానుకలు అందించారు. చేనేత శాలువాలు, ప్రత్యేకంగా నేయించిన పోచంపల్లి చీరలను ప్రదానం చేశారు.