ట్రంప్ విందులో సీఎం కేసీఆర్ స్పెషల్ అట్రాక్షన్ - MicTv.in - Telugu News
mictv telugu

ట్రంప్ విందులో సీఎం కేసీఆర్ స్పెషల్ అట్రాక్షన్

February 25, 2020

KCR

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ముగింపు సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాచ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. ప్రత్యేకించి వంటకాలను తయారు చేయించారు. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అతి కొద్ది మంది ముఖ్యమంత్రులకు మాత్రమే ఆహ్వానం అందింది. దీంట్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 

విందుకు వచ్చిన ప్రముఖులతో ట్రంప్ కరచాలనం చేశారు. సీఎం కేసీఆర్ కూడా ఆయనకు స్వాగతం పలికి కొంతసేపు ముచ్చటించారు. కాగా గతంలో ఇవాంక హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆమె కోసం కేసీఆర్ ప్రత్యేక విందు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి విందులో పాల్గొనడం అందరిని ఆకర్షించింది. ఈ విందులో ట్రంప్‌కోసం శాకాహారం, మాంసాహారంతో వివిధ రకాల వంటకాలు తయారు చేయించారు.