KCR Auction Plan,Call Data Tention In BJP
mictv telugu

ఢిల్లీ పెద్దల్లో దడదడ

November 23, 2022

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు బయటకొచ్చింది.సిట్ దూకుడుగా వ్యవహారిస్తోంది.బీజేపీ నేతలకు ఒక్కొక్కరుగా నోటీసులు ఇస్తుంది. ఇటు విచారణ సాగుతుండగా అటు ఐటీ, ఈడీలు తెలంగాణలో ఎంటరయ్యాయి. టీఆర్ఎస్ మంత్రులు, నేతల ఇళ్లల్లో సోదాలు చేసింది. ఈ సోదాల్లో ఏం దొరికింది..?ఏం దొరకలేదు. టోటల్‌గా జీరో.ముఖ్యమంత్రి కేసీఆర్ విసిరిన వలకు బీజేపీ చిక్కిందా?ఢిల్లీ పెద్దలకు కంటిమీద కునుకు లేదా? 2015 నుంచి లక్షలపేజీలకు పైగా ఉన్న కాల్ డేటానే కేసీఆర్ ఆయుధమా?బీజేపీ చిట్టా ఇందులో ఉందా?

ఢిల్లీ పెద్దల్లో కలవరం…

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీగ లాగారు. ఢిల్లీ డొంకంతా కదిలింది. ఎమ్మెల్యేల కొనుగోలు అంశం ఒక్కటే కాదు.దేశంలో బీజేపీ 2015 నుంచి ఏం చేసిందో కాల్ డేటా చిక్కింది. లక్షల పేజీల్లో ఉన్న కాల్ డేటాలో బీజేపీ బండారమంతా ఉందని తెలుస్తోంది. ఎమ్మెల్యేల కేసు ఒక్కటే కదా.. మేనేజ్ చేయొచ్చులే అని బీజేపీ భావించింది. కానీ కాల్ డేటా ఢిల్లీ పెద్దల్ని కలవరపెడుతోంది. దేశంలో బీజేపీ ఏం చేసిందో తమ చేతుల్లో ఉందని సీఎం కేసీఆర్ గతంలో చెప్పారు. ఫామ్‌హౌజ్ ఎపిసోడ్ వీడియోలు రిలీజ్ చేస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు.ఇక్కడ నుంచి ఢిల్లీ పెద్దలు డిఫెన్స్ లో పడ్డారు.కేసీఆర్‌ని దారికి తెచ్చుకోలేక కిందామీదా పడుతున్నారట. ఇందులో భాగంగా ఐటీ, ఈడీ దాడుల్ని చేయిస్తుందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

దొరికింది సున్నా…

తెలంగాణపై ఐటీ, ఈడీ నజర్ పెట్టాయి. టీఆర్ఎస్ మంత్రులు, నేతల ఇళ్లల్లో వరుసగా సోదాలు చేస్తున్నాయి. మంత్రి జగదీష్ రెడ్డి పీఏ ఇంట్లో మొదలైన తనిఖీలు మంత్రి మల్లారెడ్డి ఇంటిదాకా వచ్చాయి. మునుగోడు ఉప ఎన్నిక వేళ మంత్రి జగదీష్ రెడ్డి పీఏ ఇంట్లో ఐటీ రైడ్ చేసింది. కానీ ఇక్కడ అధికారులకు ఏం దొరకలేదు. ఆ తర్వాత మంత్రి గంగుల కమలాకర్ ఇళ్లు, గ్రానైట్ కంపెనీల్లో సెర్చ్ చేసింది. ఇక్కడా ఏం దొరకలేదు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి) సంస్థల మీద దాడులు చేసింది. అటు మంత్రి తలసాని బంధువుల ఇళ్లల్లో సోదాలు చేసింది. ఎక్కడా ఐటీ అధికారులకు ఏం దొరకలేదు.

కొండను తవ్వి…

కోడి కోయకముందే వచ్చి సోదాలు చేసిన ఐటీకి టీఆర్ఎస్ నేతల ఇళ్లల్లో ఏం దొరకలేదని సమాచారం. తెలంగాణలో కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేని పరిస్థితిలో కేంద్రం ఉందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఈడీని ఉసిగొల్పినా ఫలితం శూన్యమంటున్నారు ఆపార్టీ నేతలు. సిట్ వేగంగా దర్యాప్తు చేస్తూ పట్టపగలే బీజేపీ చుక్కలు చూపిస్తుందని వారంటున్నారు. ఇటు సిట్ దూకుడు, అటు ఐటీ రైడ్స్ తో తెలంగాణ రాజకీయం వేడెక్కింది.