KCR BIG BOMB On BJP
mictv telugu

ఆ జోకర్ ఎవరు?

November 16, 2022

సీఎం కేసీఆర్ బీజేపీపై బిగ్ బాంబ్ వేశారు. తన కూతురు,ఎమ్మెల్సీ కవితనే పార్టీ మారాలని ఒత్తిడి తెచ్చారన్నారు. పార్టీ మారుతారా అని ఎవరైనా అడిగితే చెప్పుతో కొడతామని చెప్పండి అని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలుంటాయని, సిట్టింగులకే టికెట్లు ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. కానీ కవితను పార్టీ మారమన్నదెవరు? కేసీఆర్ కూతురు అని తెలసి కూడా ప్రయత్నించిందెవరు?ఇప్పుడు ఇదే తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతల రియాక్షన్ ఏంటి?

కవితకు బీజేపీ ప్రతిపాదనలు…

“నా కూతరు,ఎమ్మెల్సీ కవితకు పార్టీ మారాలని బీజేపీ నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. దేశంలో ఆ పార్టీ చేస్తున్న వికృత రాజకీయాలకు ఇది అద్దం పడుతోంది. ఈ తరహా రాజకీయాలపై తెలంగాణనుంచే పోరాటాన్ని మొదలుపెట్టి బీజేపీకి చరమగీతం పాడుదాం. బీజేపీ రూపంలో దేశానికి పట్టిన చెదను దులుపుదాం. ఉన్మాద రాజకీయాలు చేసే ఆ పార్టీని వదిలే ప్రసక్తేలేదు” ఈ వ్యాఖ్యలు సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ విస్తృతస్థాయిలో సమావేశంలో చేశారు. నిజంగానే కవితకు బీజేపీ నుంచి ఆఫర్ వచ్చిందా? కేసీఆర్ కూతురు అని తెలిసి అప్రోచ్ అయిందెవ్వరు?కేసీఆర్ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? బీజేపీ నేతల స్పందన ఏంటి?

కొన్నాళ్లుగా…
ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పేరు ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధంలేదని ఎమ్మెల్సీ కవిత పలుమార్లు స్పష్టం చేశారు. అయినా బీజేపీ ఆరోపణలు చేయడం మానలేదు. దీనికితోడు ఈ ఆరోపణలు వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్సీ కవిత పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించలేదు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ దసరా రోజు చేసిన తీర్మానానికి ఆమె రాలేదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ వచ్చారు. కానీ ఈ సమావేశంలో ఎక్కడా కవిత కనిపించలేదు. ఆతర్వాత పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనలేదు.

ఏం జరిగింది
ఇదే అవకాశంగా తీసుకోని బీజేపీ…కవితకు పార్టీ మార్పు ప్రతిపాదనను పంపిందా?అసలు కవితను కలిసిందెవరు? ఏకంగా కేసీఆర్ కూతరుకే రాజకీయం గాలం వేయడానికి ప్రయత్నించారా? ఆ వ్యక్తి ఎవరో బీజేపీయే బయటపెట్టాలి. అంతా తెలిసి ఆమె పార్టీ మార్పు కోసం ప్రయత్నించడం బిగ్ జోక్ అని కొందరు సీనియర్ జర్నలిస్టులు అంటున్నారు. ఆ వ్యక్తి ఎవరో నిజంగా జోకరే అంటున్నారు. కేసీఆర్ చేసిన ఆరోపణలపై బీజేపీ స్పందించాలంటున్నారు. ఇక కేసీఆర్ ఆరోపణలకు బీజేపీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.