వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన చేశారు. త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జీవిత కథను సినిమాగా తీస్తానని ప్రకటించారు. తన తాజా చిత్రం డేంజరస్ ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ, పలు ప్రశ్నలకు జవాబిచ్చారు. ఏపీలో సమసిపోయిన టిక్కెట్ల వ్యవహారంలో తనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని తేల్చి చెప్పారు. బాలీవుడ్లో ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన ద కశ్మరీ ఫైల్స్ చిత్రం తనకు బాగా నచ్చిందని వెల్లడించారు. ఆర్ఆర్ఆర్పై స్పందిస్తూ.. రాజమౌళికి ఇద్దరు హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఉంటే, నాకు ఇద్దరు హీరోయిన్లు అప్సర రాణి, నైనా గంగూలీ ఉన్నారని ఛమత్కరించారు. కాగా, లెస్బియనిజం కథాంశం ఆధారంగా తెరకెక్కిన డేంజరస్ సినిమా ఏప్రిల్ 8వ తేదీన విడుదల కానుంది.