Kcr boycott niti ayog press meet
mictv telugu

తెలంగాణకు నిధులివ్వాలని నీతి ఆయోగ్ చెబితే మోదీ ఇవ్వడం లేదు.. కేసీఆర్

August 6, 2022

‘నీతి ఆయోగ్ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. నీతి ఆయోగ్ సమావేశాల ఎజెండాల్లో రాష్ట్రాలకు ఏ పాత్రా లేదు. అలాంటి పరిస్థితుల్లో అందులో పాల్గొనడం వల్ల ఏం ఒరుగుతుంది?’ అని తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేస్తే మోదీ ప్రభుత్వ పెద్దలు పక్కన పెట్టేశారని ఆరోపించారు.

‘మిషన్ కాకతీయ ప్రాజెక్టుకు రూ. 5 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ 2016లో సిఫార్సు చేసింది. మిషన్ భగీరథ కోసం రూ. 19,205 కోట్లు ఇవ్వాలని చెప్పింది. కేంద్రం ఈ సిఫార్సులను పట్టించుకోలేదు. మా ప్రభుత్వం పథకాలకు ఒక్క పైసా ఇవ్వలేదు. అంతటితో ఊరుకోకుండా సిగ్గువిడిచి, మా ప్రభుత్వ పథకాల ఘనతను తనదిగా చెప్పుకుంటోంది. మా ప్రభుత్వానికి రావాల్సిన జీఎస్టీ నిధులు ఇంకా అందలేదు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకునే నేను నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాను. ఇందులో రాజకీయం లేదు. కేంద్రం సమాఖ్య స్పూర్తిని దెబ్బతీస్తున్నది. దేశంలో విద్వేషాలు, బుల్డోజర్ విధ్వంసాలు, ఎన్‌కౌంటర్లు పెరుగుతున్నాయి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరుగుతున్నాయి. 140 కోట్ల జనాభా ఉన్న దేశానికి ఇది మంచింది కాదు.. ’ అని కేసీఆర్ విలేకర్ల సమావేశంలో అన్నారు.