దేశాభివృద్ధి, జాతీయ స్థాయిలో మూడో ప్రత్యామ్నాయం ఎజెండాతో భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)ను ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ బుధవారం ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ తొలి బహిరంగం సభలో తీవ్ర ఆవేశంతో ప్రసంగించారు. పెను ఆవేదన వెళ్లగక్కారు. భరతజాతిని పేదరికం నుంచి విముక్తం చేసి, దేశం రూపు రేఖలు పూర్తి మార్చేస్తామని భరోసా ఇచ్చారు.
ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు
1. దేశంలో అపార సహజ వనరులు ఉన్నాయి. వీటిని సరిగ్గా వాడుకుంటే పేదరికం ఉండదు. నదీజలాలను సక్రమంగా వాడుకోవాలి. మేం అధికారంలోకి వస్తే దీన్ని సాధ్యం చేస్తాం. బీఆర్ఎస్ పుట్టిందే దేశాన్ని విముక్తం చెయ్యడానికి.
2. మేం అధికారంలోకి వస్తే ప్రభుత్వ సంస్థలకు రక్షణ కల్పిస్తాం. ప్రైవేటీకరణ చేసినవాటిని తిరిగి జాతీయ చేస్తాం.
విద్యుత్ రంగాన్ని ప్రభుత్వ పరిధిలోకి తెచ్చి రెండేళ్లలో జిలుగు వెలుగుల భారతదేశాన్ని ఆవిష్కరిస్తాం.
3. దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తాం. రైతుబంధును అమలు చేస్తం.
4. దేశవ్యాప్తంగా మిషన్ భగీరథ పథకంతో మంచి నీరు అందిస్తాం.
5. ప్రతి సంవత్సరం 25 లక్షల మంది దళితులకు దళితబంధు కింద పదిలక్షల చొప్పున అందిస్తాం
6. మహిళలకు అన్నిరంగాల్లో 33 శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తాం.
7. సైనిక నియామకాల మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ను రద్దు చేస్తాం.
8. 2024 తర్వాత మోదీని ఇంటికి వెళ్తారు, మేం ఢిల్లీకి వెళ్తాం.
9. విశాఖ ఉక్కు పరిశ్రమను ఎట్టి పరిస్థితిలోనూ ప్రైవేటీకణ కానివ్వం. మోదీ అమ్మితే మళ్లీ కొనుక్కుంటాం.
10. త్వరలో బీఆర్ఎస్ విధానాలు ప్రకటిస్తాం. 150 మంది మేధావులు మా పార్టీ విధానాలు రూపొందిస్తున్నారు