దేశానికి లక్ష్యం లేదని కేసీఆర్ విమర్శించారు. మోదీ పాలనలో దేశం పరిస్థితి దారుణంగా ఉందని మండిపడ్డారు. మేకిన్ ఇండియా జోకింగ్ ఇండియాగా మారిందని సీఎం ఆరోపించారు.
ద్రవ్య వినిమయ బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం కేసీఆర్ సుదీర్థంగా ప్రసంగించారు. బీజేపీతో పాటు కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఎల్ఐసీ (LIC)ని అమ్మాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అని కేసీఆర్ ప్రశ్నించారు. నష్టం వస్తే సమాజం నెత్తిన.. లాభం వస్తే ప్రైవేట్‌కు అప్పగిస్తున్నారని తెలిపారు. ” ఎయిర్ ఇండియాను మళ్లీ టాటాలకు అప్పగించారు.
మోదీ హయాంలో ఏ రంగంలోనైనా వృద్ధి జరిగిందా? కాంగ్రెస్ హయాంలో వార్షిక వృద్ధి రేటు 6.8, కానీ మోదీ వచ్చాక మన వృద్ధి రేటు 5.8కి పడిపోయింది. యూపీఏ హయాంలో వృద్ధిరేటు 24 శాతం ఎక్కువ. కాంగ్రెస్ పాలనలో తలసరి ఆదాయం వృద్ధిరేటు 12.7 ఉండగా, మోదీ పాలనలో తలసరి ఆదాయం వృద్ధిరేటు 7.1 ఉంది. మోదీ పాలనలో సగానికి సగం పడిపోయింది. ప్రధాని మోదీకి ఓట్లు కావాలంటే బియ్యం ఫ్రీ అంటారు. అని కేసీఆర్ ధ్వజమెత్తారు. తాను చెప్పిన లెక్కల్లో అవాస్తవం ఉంటే రాజీనామా చేస్తానని కేసీఆర్ సవాల్ విసిరారు.