కేంద్రానికి కేసీఆర్‌ సీరియస్ వార్నింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

కేంద్రానికి కేసీఆర్‌ సీరియస్ వార్నింగ్

June 2, 2022

”ప్రస్తుతం భారతదేశం ప్రమాదకరస్థితిలో ఉంది. విద్వేష రాజకీయాల్లో చిక్కి, దేశం విలవిల్లాడుతోంది. దేశంలో మత పిచ్చి తప్ప వేరే చర్చే లేదు. విచ్ఛిన్నకర శక్తులు ఇలాగే పేట్రేగిపోతే, సమాజ ఐక్యతకు ప్రమాదం ఏర్పడుతుంది. అశాంతి ఇలాగే ఉంటే అంతర్జాతీయ పెట్టుబడులు రావు. దేశం కోలుకోవడానికి మరో వందేళ్లు పట్టినా ఆశ్చర్యం లేదు. దేశ ప్రజలకు కావాల్సింది.. కరెంట్‌, మంచినీళ్లు, ప్రాజెక్టులు, ఉద్యోగాలు, ఉపాధి. ప్రగతి పథంలో దేశం పరుగులు పెట్టాలంటే, నూతన వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక విధానాలు కావాలి. దేశంలో రైతులు బిక్షగాళ్ళు కాదు. రైతులతో పెట్టుకోవద్దు” అంటూ కేసీఆర్ మరోసారి కేంద్రంపై సీరియస్ అయ్యారు.

తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా గురువారం పబ్లిక్‌ గార్డెన్స్‌లో కేటీఆర్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్ర హక్కుల సాధన కోసం కేంద్రంతో పోరాడాల్సి వస్తోంది. ప్రగతి శీల రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించడం లేదు. నిధులు కేటాయించాలని ప్రధాని మోదీని కోరినా ప్రయోజనం శూన్యం. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు నిధులు ఇవ్వడం లేదు. పన్ను మినహాయింపు లాంటి ప్రోత్సహాకాలు కూడా ఇవ్వడం లేదు. ఆఖరికి అత్యంత క్లిష్టమైన కరోనా సమయంలోనూ రాష్ట్రానికి కేంద్రం నయా పైసా సాయం అందించలేదు.’ అని కేసీఆర్‌ అన్నారు.