నేటి నుంచే కేసీఆర్ దేశ పర్యటన.. వివరాలు ఇదిగో.. - MicTv.in - Telugu News
mictv telugu

నేటి నుంచే కేసీఆర్ దేశ పర్యటన.. వివరాలు ఇదిగో..

May 20, 2022

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేటి నుంచి దేశవ్యాప్తంగా పర్యటనలు చేయడానికి సిద్ధమైయ్యారు. ఈ పర్యటనకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. జాతీయ స్థాయిలో పలు రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొననున్నారు.  రాజకీయ, ఆర్ధిక, మీడియా రంగాల ప్రముఖులతో సమావేశమై, దేశం కోసం వీర మరణం పొందిన సైనిక కుటుంబాలకు, జాతీయ రైతు ఉద్యమంలో ప్రాణాలు వదిలిన అన్నదాతల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయనున్నారు.

కేసీఆర్ పర్యటన ఇలా సాగనుంది..”శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి బయల్దేరి, అక్కడ వివిధ రాజకీయ పార్టీల నేతలతో, ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశమవుతారు. ఆ తర్వాత జాతీయ మీడియా సంస్థల ప్రముఖులతో సమావేశం అవుతారు. 22న మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ఛండీగడ్‌కు వెళ్తారు. పంజాబ్, హరియాణా ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన సుమారు 600 మంది కుటుంబాలను పరామర్శిస్తారు. ఒక్కో కుటుంబానికి రూ. 3 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేస్తారు.

28న ఉదయం బెంగళూరు వెళ్తారు. అక్కడ మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిలతో సమావేశమవుతారు. మే 27న రాలేగావ్ సిద్ది వెళ్లి ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేతో భేటీ అవుతారు. అక్కడి నుంచి శిరిడీ వెళ్లి సాయిబాబాను దర్శించుకుని హైదరాబాద్‌కు తిరిగొస్తారు”.