24నుంచి కేసీఆర్ క్రికెట్ కప్ పోటీలు - MicTv.in - Telugu News
mictv telugu

24నుంచి కేసీఆర్ క్రికెట్ కప్ పోటీలు

May 22, 2017

ఈ నెల 24 నుంచి కేసీఆర్ క్రికెట్ కప్ పోటీలు నిర్వహిస్తామని ఎంపీ కవిత చెప్పారు. నిజామాబాద్ శివారు నాగారం రాజారాం మైదానంలో క్రికెట్ పోటీలు ఉంటాయన్నారు. క్రికెట్ పోటీలో రాష్ట్రానికి చెందిన టీమ్స్ తోపాటు ఇతర రాష్ట్రాల జట్లు పాల్గొంటాయని కవిత చెప్పారు. విన్నింగ్ టీమ్ కు కప్‌తోపాటు రూ.3 లక్షలు నగదు బహుమతి, రన్నరప్ జట్టుకు రూ.1.5 లక్షలు ప్రోత్సాహక బహుమతి అందజేస్తామన్నారు. ఏటా నిజామాబాద్‌లో కేసీఆర్ క్రికెట్ కప్ నిర్వహిస్తామని కవిత తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకే కేసీఆర్ క్రికెట్ కప్ పోటీలు నిర్వహిస్తున్నామని ఆమె అంటున్నారు.